క్యారెట్..
( Carrot ) దుంప జాతికి చెందిన కూరగాయల్లో ఒకటి.చాలా మంది క్యారెట్ ను పచ్చిగానే తింటుంటారు.
రుచికి తియ్యగా ఉండే క్యారెట్ లో అనేక పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది.
అయితే చర్మ కాంతిని పెంచడానికి కూడా క్యారెట్ సహాయపడుతుంది.ముఖ్యంగా క్యారెట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే బోలెడు స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక క్యారెట్ ( Carrot )తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కతను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ను వేసుకోవాలి.అలాగే ఐదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్యారెట్ జ్యూస్,( Carrot juice ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత సున్నితంగా చర్మాన్ని రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ క్యారెట్ ఎగ్ మాస్క్ వేసుకోవడం వల్ల ముఖ చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.
ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయిసాగిన చర్మం టైట్ గా తయారవుతుంది.ముఖంపై మొండి మొటిమలు, మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.
అందంగా మెరుస్తుంది.కాబట్టి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ( Glowing skin )ను కోరుకునేవారు క్యారెట్ తో తప్పకుండా పైన చెప్పిన విధంగా ఫేస్ మాస్క్ వేసుకునేందుకు ప్రయత్నించండి.







