నందమూరి తారక రామారావుకి( Nandamuri Taraka Rama Rao ) నలుగురు ఆడపిల్లలు మరియు ఏడుగురు మగపిల్లలు సంతానం.అయితే ఆయన సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి తన సంతానంలో హరికృష్ణ ని మరియు బాలకృష్ణని నటీనటులుగా పరిచయం చేసినప్పటికీ మిగతా వారిని సైతం సినిమా ఇండస్ట్రీలోని వివిధ భాగాల్లోనే సెటిల్ అయ్యేలా ఎన్టీఆర్ ప్రోత్సహించారు.
అయితే అప్పుడు ఎన్టీఆర్ తో ఉన్నవారు, ఆయనని దగ్గరగా చూసినవారు ఎవరైనా కూడా ఆయన వారసత్వపు తాలూకా లక్షణాలు ఆయన కొడుకుల్లో ఎవరికీ రాలేదు అంటూ ఉంటారు.ఆయనకున్న ఆ ఠీవి లేదా తెలివి తేటలు, మంచితనం అలాగే సినిమాపై ఉన్న నిబద్ధత మిగతా వారికి ఎవరికీ రాకపోవడం గమనించాల్సింది విషయం.

అయితే ఎన్టీఆర్ తన రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.ఆయన రాజకీయాల్లోకి రావడం, పార్టీ పెట్టిన కొద్ది నెలలకి అధికారాన్ని చేజిక్కించుకోవడం, ఆ తర్వాత రెండో పెళ్లి ద్వారా కొన్ని చెడు సంఘటనలు జరగడం, ఆ తర్వాత ఆ కుటుంబం అంతా కలిసి ఆయనని గద్దె దించడం మనమందరం కల్లారా చూసాం.నిజానికి ఎన్టీఆర్ తన కుటుంబం చేతనే వెన్నుపోటుకు గురయ్యారు అని అంతా అంటూ ఉంటారు.అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఆయన చేసిన కొన్ని తప్పులు కూడా ఉన్నాయి అనేది అందరూ తెలుసుకోవాల్సింది విషయం.
ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్లడం లేదు కానీ ఎన్టీఆర్ కి తన పిల్లల విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఉంది.

11 మంది తన సంతానంలో తెలివైన వారు ఎవరు అంటే ఎన్టీఆర్ టక్కున పురందరేశ్వరి( Purandareshwari ) పేరు మాత్రమే చెప్పేవారట.నా కొడుకులు ఎవరూ కూడా అంత తెలివి కలిగిన వారు కాదు, చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తాడు కానీ పురందరేశ్వరి అంత నిక్కచ్చయిన వ్యక్తి కాదు, అందరి తెలివి తేటలు కూడా దానికి ఒక్కదానికే ఉన్నాయి అంటూ ఆమె గొప్పతనం గురించి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయట.నాడు ఎన్టీఆర్ ను గద్దె దించడానికి చంద్రబాబు ముందు నడిపించిన వెనకాల ఉండి చక్రం తిప్పింది కూడా పురందరేశ్వరి అనేది చాలా మంది చెప్పే మాట.ఇప్పటికి కూడా ఎన్టీఆర్ యొక్క అన్ని లక్షణాలు కలగలిపి ఉన్నది కూడా కేవలం ఆమెకు మాత్రమే అంటారు.