సాధారణంగా స్త్రీలకు పీరియడ్స్ అనేది ప్రతి 28 రోజులకు ఒకసారి వస్తుంది.మరికొందరికి మరో రెండు మూడు రోజులు ఆలస్యం అవుతుంది.
దీనివల్ల పెద్ద సమస్య ఏమి ఉండదు.కానీ కొందరికి మాత్రం పీరియడ్ కీ పీరియడ్ కీ మధ్య ముప్ఫై ఐదు, నలభై రోజుల కంటే ఎక్కువ గ్యాప్ వస్తూ ఉంటుంది.
దీనిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు.ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల శారీరకంగానే కాకుండా మానసిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రతి నెల పీరియడ్స్ ఆలస్యంగా రావడం వల్ల బరువు పెరగడం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, ముఖంపై అవాంఛిత రోమాలు, మూడ్ స్వింగ్స్ తదితర సమస్యలు తలెత్తుతాయి.

అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను నిర్లక్ష్యం చేస్తే సంతాన సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే ఈ సమస్యను వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ డ్రింక్ ను వారానికి కేవలం రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక చిన్న బీట్ రూట్‌ను తీసుకొని పీల్ తొలగించి వాటర్ లో కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ బాగా హీట్ అవ్వగానే అందులో బీట్ రూట్ తురుము, నాలుగు నుంచి ఐదు పుదీనా ఆకులు, నాలుగు లవంగాలు, అర టేబుల్ స్పూన్ అల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కనీసం పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.
ఈ డ్రింక్‌ను వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే పీరియడ్స్ క్రమం తప్పకుండా ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను నివారించడానికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
పైగా ఈ డ్రింక్ ను తీసుకుంటే రక్తహీనత సమస్య సైతం దూరం అవుతుంది.