ప్రస్తుతం వర్షాకాలం( rainy season ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.నిత్యం చిరుజల్లులు పలకరించి పోతూనే ఉన్నాయి.
అయితే ఈ సీజన్ లో మేకప్ వేసుకుని బయటకు వెళ్లామంటే.వర్షాల దెబ్బకు మొత్తం చెదిరిపోతుంది.
అందుకే ఈ సీజన్ లో మేకప్ ను పక్కన పెట్టండి.సహజంగానే అందంగా మెరిసి పోవడానికి ప్రయత్నించండి.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ) వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఈలోపు ఒక టమాటోను( Tomato ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, రెండు పచ్చి పసుపు కొమ్ము( pasupu kommu ) స్లైసెస్ వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ), హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం చర్మాన్ని మెల్లగా స్క్రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఏ రెమెడీని కనుక పాటిస్తే సహజ అందం మీ సొంతం అవుతుంది.

చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells ) తొలగిపోతాయి.చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.
మొండి మొటిమలు మచ్చలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.ముడతలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మరియు చర్మం యవ్వనంగా మెరుస్తుంది.కాబట్టి ఇకపై మేకప్ ఉత్పత్తులను పక్కన పెట్టి ఈ రెమెడీతో సహజంగానే అందంగా మెరిసి పోవడానికి ప్రయత్నించండి.