ఈ గ్రీన్ జ్యూస్ వల్ల పొందే లాభాల గురించి తెలిస్తే తాగకుండా ఉండలేరు!

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నారు.ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటున్నారు.

 This Green Juice Has Many Health Benefits , Green Juice, Health, Green Apple, Av-TeluguStop.com

అలాగే రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేస్తూ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు.అయితే ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ జ్యూస్ కూడా మీ ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందిస్తుంది.

ఆ లాభాల‌ గురించి తెలిస్తే దాన్ని తాగకుండా ఉండలేరు.మరి ఇంతకీ ఆ గ్రీన్ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.?వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కప్పు పాలకూరని తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా క‌డిగిన‌ పాలకూరను ఆవిరిపై మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత ఒక గ్రీన్ ఆపిల్ ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అవకాడో ని తీసుకుని సగానికి కట్ చేసి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేయాలి.

Telugu Avocado, Cucumber, Green Apple, Green, Tips, Latest, Spinach-Telugu Healt

ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో ఆవిరిపై ఉడికించి పెట్టుకున్న‌ పాలకూర, గ్రీన్ ఆపిల్ ముక్కలు అవకాడో పల్ప్, అరకప్పు కీర ముక్కలు వేసుకోవాలి.అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, పావు స్పూన్‌ నల్ల ఉప్పు, ఒక‌ కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ జ్యూస్ సిద్ధమవుతుంది.ఈ గ్రీన్ జ్యూస్ ను రోజుకు ఒక సారి తీసుకుంటే గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్, ఆల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది.

ఒకవేళ మధుమేహం ఉన్నా.

రక్తంలో చక్కెర‌ స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే ఈ గ్రీన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

కంటి చూపు రెట్టింపు అవుతుంది.శ‌రీరంలో వ్యర్థాలు తొలగిపోయి అంతర్గత అవయవ్యాలు క్లీన్ గా మారతాయి.

మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube