అందుకే అతి చేయకూడదంటారు... కళ్లలో 23 లెన్సులు పెట్టుకున్న మహిళ.. చివరికి?

అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది కానీ అతిగా అందం కోసం ప్రయత్నిస్తే అసలుకే ఎసరు వస్తుంది.ఇప్పటికే అందంగా కనిపించాలని చాలామంది తమ శరీరాలపై ప్రయోగాలు చేసి చివరికి అందవిహీనంగా తయారయ్యారు.

 A Woman With 23 Lenses In Her Eyes.. In The End Viral Video, Contact Lenses, Off-TeluguStop.com

ఇందుకు హీరోయిన్లు మినహాయింపేమీ కాదు.చూస్తున్నాం కదా సర్జరీ వికటించి ఆయా హీరోయిన్ ఎలా తయారయ్యారో! కాగా తాజాగా ఒక మహిళా తన కళ్లు అందంగా కనిపించాలనుకుంది.

అందుకు ఎవరూ ఊహించని రీతిలో కాంటాక్ట్ లెన్సులను ఒక కంటిలో వేసుకుంది.కంటి అందాల కోసం మహిళ చేసిన ఈ ప్రయత్నం చివరికి ఆమె కంటి చూపును పోగొట్టే పరిస్థితికి తీసుకొచ్చింది.

దీంతో డాక్టర్లు అది కష్టం మీద ఆమె కంటిని కాపాడారు.

వివరాల్లోకి వెళితే.

అమెరికాకి చెందిన ఒక మహిళకు చాలా రోజులుగా కంటిలో కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంటోంది.కంటి అందాల కోసం, మెరుగైన చూపు కోసం వీటిని వాడుతోంది.

అయితే 23 రోజులుగా ఆమె రోజూ ఉదయం ఒక కాంటాక్ట్ లెన్స్ తన కంటిలో వేసుకునేది.పడుకునేటప్పుడు ఆ కాంటాక్ట్ లెన్స్‌ను తన కంటి నుంచి తీసివేయడం మరిచిపోయేది.

మళ్లీ ఉదయం లేవగానే తన కంటి ఒక కాంటాక్ట్ లెన్స్ ఉందనేది ఆమె మరిచిపోయేది.ఇలా మతిమరుపు కారణంగా కాంటాక్ట్ లెన్సులు తీయకుండానే ఆమె వరుసగా 23 రోజుల పాటు రోజుకొక కాంటాక్ట్ లెన్స్ కళ్లలో పెట్టుకుంది.

ఫలితంగా 23వ రోజు ఆమె కంటిలో బాగా నొప్పి వచ్చింది.దాంతో డాక్టర్ వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసింది.

కాథరీనా కుర్తీవా అనే కంటి వైద్యురాలు ఈ మహిళ కంటి నొప్పికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించగా కాంటాక్ట్ లెన్స్‌లు ఉన్నట్లు తేలింది.ఆ తర్వాత డాక్టర్ కాథరీనా చాలా జాగ్రత్తగా మహిళ కంటి నుంచి కాంటాక్ట్ లెన్స్‌లను తొలగించారు.“ఒకరి కంటి నుంచి 23 కాంటాక్ట్ లెన్స్‌లను రిమూవ్ చేశాను.నా క్లినిక్ నుంచి రియల్ లైఫ్ వీడియో ఇది.కాంటాక్ట్ లెన్స్‌ను ధరించిన్నప్పుడు నిద్రపోకండి” అని ఆ డాక్టర్ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ పేర్కొన్నారు.ఆ తర్వాత శుభ్రమైన నీటితో ఆమె కళ్లను కడిగారు.

యాంటీబయోటిక్స్ కూడా అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube