ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు వారి పనులలో బిజీగా ఉండి ఖచ్చితంగా సమయంలో భోజనం చేయకుండా ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.మనం ఎంత కష్టపడి పని చేసినా చివరికి ఒక ముద్ద అన్నం కోసమే.
మనం ఎంత కష్టపడి పనిచేసిన కడుపునిండా అన్నం తినకపోతే ఆ కష్టమంతా వృధా అయిపోయినట్లే.అలాగే భోజనం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు.
బాగా డబ్బు ఉన్నవారు మంచి రుచికరమైన ఆహారాన్ని వండి తింటూ ఉంటారు.డబ్బులు లేని వారు పూటకు గంజి ఉంటే చాలని జీవిస్తూ ఉంటారు. రాత్రి భోజనం చేసిన తర్వాత అసలు చేయకూడని ఈ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భోజనం చేసిన తర్వాత ఈ తప్పులను చేయకపోతే అన్నపూర్ణ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
అన్నం ఎక్కువగా వండి అనవసరంగా బయట పారేయడం కూడా అంత మంచిది కాదు.
ఇంట్లో వండిన అన్నం మిగిలితే కనుక బయట పారే వేయకుండా అన్నం దొరకని పక్కవారికి దానం చేయడం కూడా మంచిదే.
ఇలాగా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఆ ఇంటి కుటుంబ సభ్యులపై ఉంటుంది.భోజనం చేసిన తర్వాత కంచం లో కూడా చేతులు కడగకూడదు.తిన్న కంచంలో చేతులు కడగడం అనేది చాలా తప్పు ఇది మనకు దరిద్రాన్ని కలిగిస్తుందని పెద్దలు నమ్ముతారు.

ఇక మనలో కొంతమంది భోజనం చేసే ప్లేట్లోనే ఉమ్మి కూడా వేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ఆగ్రహానికి గురి అవుతారు.కంచాన్ని అన్నాన్ని మనం ఎంతో పవిత్రంగా భావించడం వల్ల అన్నపూర్ణ దేవి అనుగ్రహం మనపై ఉంటుంది.
అన్నం తిన్న తర్వాత టూత్ పిక్లతో, పిన్నిస్ లతో నోటిని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటుంది .ఇలా చేయడం వల్ల కూడా దరిద్రం.ఇలా కూడా అసలు చేయకూడదు.దంతాల మధ్య ఇరుక్కున్నవి బయటకు రావాలంటే నోట్లో నీళ్లు పోసుకుని నాలుగైదు సార్లు పుక్కలించడం వల్ల నోరు శుభ్రం అవుతుంది.