స్కిన్ టోన్ ను పెంచుకోవడం కోసం చాలా మంది ఖరీదైన క్రీములను వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే క్రీముల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఆయిల్ మాత్రం మీ చర్మ ఛాయను అద్భుతంగా రెట్టింపు చేయగలదు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక మీడియం సైజు క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన క్యారెట్ ను సన్నగా తురుముకోవాలి.అలాగే ఒక ఆరెంజ్ పండును తీసుకుని వాటర్‌లో కడగాలి.ఆపై పీల్ మాత్రమే వచ్చేలా తురుముకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ జార్ ను తీసుకుని అందులో క్యారెట్ తురుము, ఆరెంజ్ పీల్ తురుము, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలి.
అలాగే అందులో రెండు బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేయాలి.
చివరిగా ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ గ్లాస్ జార్‌ను మరుగుతున్న నీటిలో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.
ఆపై నూనె పూర్తిగా చల్లారిన అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో సపరేట్ చేసుకుని ఒక బాటిల్‌లో నింపుకోవాలి.

ఈ ఆయిల్ ను రోజు నిద్రించే ముందు ముఖానికి, మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజూ కనుక చేస్తే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై ముడతలు, ముదురు రంగు మచ్చలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది.
కాబట్టి, తప్పకుండా ఈ ఆయిల్‌ను వాడేందుకు ప్రయత్నించండి.