బిగ్ బాస్ తెలుగులో సీజన్ 6 నడుస్తుంది.సీజన్ 1 ఎన్.
టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేయగా సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు.ఇక ఇదిలాఉంటే హిందీలో బిగ్ బాస్ 15 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకుంది.బిగ్ బాస్ హిందీ వర్షన్ 2006లోనే మొదలైంది.మొదటి సీజన్ ను అక్కడ అర్షద్ వార్సి హోస్ట్ గా చేశారు.ఆ తర్వాత సెకండ్ సీజన్ అప్పటికే ఇండియా నుంచి బిగ్ బ్రదర్ షోకి వెళ్లిన శిల్పా శెట్టి హోస్ట్ గా చేసింది.3వ సీజన్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేశారు.ఇక 4వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేశారు.
మధ్యలో 9వ సీజన్ మాత్రం ఫరా ఖాన్ హోస్ట్ గా చేశారు.అయితే మళ్లీ 10వ సీజన్ నుంచి 15వ సీజన్ వరకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేశాడు.
అయితే బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ తప్పుకుంటున్నారని టాక్.ఆయన ప్లేస్ లో కరణ్ జోహార్ హోస్ట్ గా వస్తారని టాక్.మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా బిగ్ బాస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది.అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా సూపర్ సక్సెస్ కాగా ఇప్పుడు ఆయన హోస్ట్ నుంచి తప్పుకుంటారని తెలియడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు.