పండితుడు కుమారుడు పరమ శుంఠ అవుతాడు.ఇది ఆ కాలం నుంచి ఈ నటి వరకు వస్తున్న ఒక నానుడి.
దేని అర్ధం ఏమిటో వివరించాల్సిన అవసరం అయితే లేదు.ఎవరైనా ఒక వ్యక్తి ఒక విషయంలో లేదా ఒక వృత్తి లో నిష్ణాతుడు అయ్యాడంటే అతడి కుమారుడు ఎందుకు పనికి రాదు అనేది ఒక భావన.
ఈ విషయాన్నీ సినిమా ఇండస్ట్రీ లో స్టార్స్ గా చలామణి వారికి అన్వయించవచ్చు.కోలీవుడ్ లో నే కాకుండా సౌత్ ఇండియాలో నే ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్డ్రస్సు గా విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరు అయినా విక్రమ్ తన కుమారుడు ధృవ్ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసాడు.
ఎంతో స్వయంకృషితో పైకి వచ్చి, మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న విక్రమ్ తన కొడుకుని పరిచయం చేయగానే అందరు పెదవి విరిచారు.విక్రమ్ లాంటి నటుడి కుమారుడు అయినా కూడా ఒక్క ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకలేకపోతున్నాడు అంటూ కొట్టిపారేశాడు.
ఇక ధృవ్ మొదటి సినిమా గ్రేట్ దర్శకుడు అయినా బాల చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నారు అనగానే జనాల్లో అంచనాలు పెరిగిపోయాయి.కానీ అది అర్జున్ రెడ్డి రీమేక్ కావడం తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి.
కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అతడి లుక్స్, ఎక్సప్రెషన్స్ పెద్దగా ఎక్కలేదు.
దాంతో పండిత పుత్ర పరమ శుంఠ అంటూ కొన్ని కామెంట్స్ వినిపించాయి.
ఇక్కడ వరకు అంత ఒకే కానీ ఉలి దెబ్బ తగిలితే కానీ రాయి శిల్పం అవుతుంది.ఆలా ఒకటి రెండు దెబ్బలతో ధృవ్ లోని నటుడు బయటకి వచ్చాడు.అతడు నటించిన మహాన్ సినిమా ధృవ్ లోని విక్రమ్ ని అచ్చుగుద్దినట్టుగా చూపించింది.క్లైమాక్స్ లో అయితే ధృవ్ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసినట్టుగా స్ప్రష్టం గా కనిపించింది.
సినిమా కూడా చాల బాగుంటుంది.ఇక ధృవ్ మంచి నటుడు అయితే అయ్యాడు ఇక స్టార్ హీరో అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
సరైన సినిమా పడితే ధృవ్ ఒక వేటాడే పులి లా కదన రంగంలో దూకి విజయం తో పైకి రాగలడు.