సాధారణంగా ఆడవారిలో కొందరు పొడవాటి జుట్టును చాలా ఇష్టపడుతుంటారు.పొడవాటి జుట్టు ( long hair )అమ్మాయిలు అంటే అబ్బాయిలకు కూడా ఒక ప్రత్యేకమైన మక్కువ ఉంటుంది.
అందుకే ఓ వాలు జడ.మల్లెపూల జడ.ఓ పాము జడ.ఆ.సత్యభామ జడ అంటూ ఆడవారి పొడుగు జుట్టు ని పొగుడుతూ పాట కూడా రాశారో రచయిత.ఆ విషయం పక్కన పెడితే తక్కువ సమయంలోనే పొడవాటి జుట్టును పొందాలని కోరుకునే మగువలకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.
ఆ జాబితాలో ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఒకటి.జుట్టును పొడుగ్గా పెంచడానికి ఈ రెమెడీ ఎంతో పవర్ ఫుల్ గా పని చేస్తుంది.మరి ఆలస్యం చేయకుండా లాంగ్ హెయిర్ కు సహాయపడే ఆ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కలబంద ఆకుని( Aloe vera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడగాలి.
ఆపై కలబందను కట్ చేసి లోపల ఉంటే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు వైట్ రైస్( White rice ), రెండు రెబ్బలు కరివేపాకు( curry leaves ), రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉసిరికాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ మరియు కలబంద జెల్ వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.
పొడవాటి కురులను కోరుకునే వారికి ఈ ప్యాక్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.పైగా ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు దూరమవుతుంది.
కురులు దృఢంగా సైతం మారతాయి.