సాధారణంగా కొందరు పిల్లలు ఎంతో యాక్టివ్ గా ఉంటారు.చదువులతో పాటు ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు.
నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.కానీ కొందరు పిల్లలు మాత్రం అలా కాదు.
ఎప్పుడు చూసినా మూడీగా కనిపిస్తుంటారు.చదువుల్లో ఆటపాటల్లో కాదు ప్రతి విషయంలో వెనకడుగు వేస్తుంటారు.చురుకుదనం అస్సలు కనిపించదు.ఈ జాబితాలో మీ పిల్లలు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.వెంటనే వారి డైట్ లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను చేర్చండి.
ఈ డ్రింక్ ప్రతిరోజు ఇవ్వడం వల్ల పిల్లలు హుషారు గా మారడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.
దాన్ని తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయో.తెలుసుకుందాం పదండి.
ముందుగా పది బాదం పప్పులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఐదు జీడిపప్పు, పది పిస్తా పప్పులు కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఆవు పాలను పోసుకోవాలి.పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసి ఒక నిమిషం పాటు హీట్ చేయాలి.
అనంతరం కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, పిస్తా పలుకులు వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ తాటి బెల్లం పొడి వేసి మరో నిమిషం పాటు మరిగించి చేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన డ్రింక్ సిద్ధమవుతుంది.

ఈ డ్రింక్ ను కాస్త గోరు వెచ్చగా అయిన తర్వాత పిల్లల చేత తాగించాలి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో పిల్లలకు ఈ డ్రింక్ ను ఇవ్వడం వల్ల వారిలో మూడీనెస్ పరార్ అవుతుంది.ఫుల్ యాక్టివ్గా ఎనర్జిటిక్ గా మారతారు.మెదడు పనితీరు మునుపటి కంటే చురుగ్గా పనిచేస్తుంది.ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఎముకలు, కండరాలు దృఢంగా పెరుగుతాయి.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఆటపాటల్లో చదువుల్లో ఉత్తమంగా రాణిస్తారు.కాబట్టి తప్పకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ ను మీ పిల్లల డైట్ లో చేర్చేందుకు ప్రయత్నించండి.