తెలంగాణ బడ్జెట్ లో ఏ శాఖలకు ఎంత కేటాయించారంటే..?

గురువారం జూలై 25న తెలంగాణ బడ్జెట్ 2024ను డిప్యూటీ సీఎం, ఆర్ధికశాఖ మంత్రి బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.” నా తెలంగాణ కోటి రతనాల వీణ.” అనే దాశరధి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆయన గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లాయని.అలాగే గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్ర పాలన అస్తవ్యస్తంగా సాగడంతో రాష్ట్రం అప్పులతో ఆర్థిక పరిస్థితిని ప్రమాదకరంగా తెచ్చుకుందని ఆయన తెలిపారు.

 How Much Has Been Allocated To Which Departments In The Telangana Budget, Ghmc,-TeluguStop.com

ఇకపోతే నేడు ప్రకటించిన బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత మొత్తం కేటాయించారో ఒకసారి చూద్దాం.

Telugu Agriculture, Congress, Ghmc, Gruhajyothi-Latest News - Telugu

ఇక నేడు ప్రవేశపెట్టింన మొత్తం తెలంగాణ బడ్జెట్( Telangana Budget ) విలువ రూ.2,91,159 కోట్లు.ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు., మూలధన వ్యయం రూ.33,487 కోట్లు.వైద్య ఆరోగ్యంకు రూ.11,468 కోట్లు, వ్యవసాయంకు రూ.72,659 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమంకు రూ.2736 కోట్లు, ట్రాన్స్‌కో, డిస్కంలుకు రూ.16,410 కోట్లు, ఎస్‌సి సంక్షేమంకి రూ.33,124 కోట్లు, బిసి సంక్షేమంకి రూ.9200 కోట్లు, ఎస్‌టి సంక్షేమంకు రూ.17056 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు, మైనార్టీ సంక్షేమంకు రూ.3003 కోట్లు, అడవులు, పర్యావరణంకు రూ.1064 కోట్లు, హోంశాఖకు రూ.9,564 కోట్లు, విద్యాశాఖకు రూ.21,292 కోట్లు, రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు, హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, గృహజ్యోతి( Gruha Jyothi Scheme)కి రూ.2,418 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు, ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు, 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు కేటాయించారు.

Telugu Agriculture, Congress, Ghmc, Gruhajyothi-Latest News - Telugu

వీటితోపాటు.ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకూ రూ.100 కోట్లు, మెట్రో వాటర్‌ వర్క్స్‌ కోసం రూ.3385 కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం రూ.200 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.500 కోట్లు, ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు., మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు, మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు, హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు, హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube