మనలో చాలామంది మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరి ఎలాంటి కష్టాలు లేకుండా జీవనం సాగించాలని కోరుకుంటారు.అయితే ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడంతో పాటు దేవుడి అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి.
శ్రీశైలంలోని( Srisailam ) రహస్య ప్రదేశంలో ఉన్న ఇష్ట కామేశ్వరి అమ్మవారిని ( Ishtakameswari devi )దర్శించుకోవడం ద్వారా మనం కోరుకున్న కోరికలు తీరతాయి.
చాలా తక్కువమందికి తెలిసిన ఈ ఆలయంను స్థానికులు ఇష్టకామేశ్వరి దేవి ఆలయం అని పిలుస్తారు.మన దేశంలో కేవలం శ్రీశైలంలో మాత్రమే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది.శ్రీశైలం కూడలి నుంచి కేవలం జీపు మార్గంలో మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
దట్టమైన నల్లమల అడవుల మధ్య ఈ ఆలయం ఉండటం గమనార్హం.ఎన్నో బండరాళ్లను దాటుకుని ఈ మార్గంలో జీపులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఈ ఆలయ మార్గానికి వెళ్లే జీపులు అటవీ శాఖ అధికారుల ( Forest Department officials )అనుమతి తీసుకుని మాత్రమే ప్రయాణం సాగించాలి.ఎంతో నేర్పు కలిగిన డ్రైవర్లు మాత్రమే ఈ మార్గంలో జీపును నడపగలరు.ఈ ఆలయంలో అమ్మవారికి నుదుట కుంకుమ పెట్టి కోరికలను కోరుకుంటే ఆ కోరికలు తీరతాయి.స్థానికుల ద్వారా ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
కేవలం పగటిపూట మాత్రమే జీపులో ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.రాత్రి సమయంలో జంతువులు సంచరిస్తాయి కాబట్టి ఈ మార్గంలో అనుమతించరు.శ్రీశైలానికి వెళ్లే ప్రయాణికులు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా మన కోరికలను తీర్చుకోవడంతో పాటు దేవత అనుగ్రహం పొందే అవకాశాలు ఉంటాయి.రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.
ఇష్టకామేశ్వరి ఆలయం విశిష్టత గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
LATEST NEWS - TELUGU