ఈ దేవాలయాన్ని దర్శిస్తే శని ప్రభావం అనారోగ్య సమస్యలు దూరం కావడం ఖాయం..?

మనకు ఆరోగ్యం సహకరించనప్పుడు, శని ప్రభావం( Shani Effect ) ఎక్కువగా ఉన్నప్పుడు, మానవ ప్రయత్నం సరిపోనప్పుడు మనం చూసేది భగవంతుడి వైపే అని కచ్చితంగా చెప్పవచ్చు.మనం ఈ రోజు పడుతున్న బాధ అంతా మన గ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు.

 Shani Dosham Remedies Surya Narayana Temple Kumbakonam Details, Shani Dosham , S-TeluguStop.com

అలాంటి గ్రహాలలో సూర్యభగవానుడు( Surya Bhagawan ) ముఖ్యమైనవాడు.ఆయన ఇతర గ్రహాలతో కలిసి వెలిసిన ప్రాంతం కుంభకోణంలోని సూర్యనారాయణ దేవాలయం.

ఇది చాలా విశిష్టమైనది.శని బాధ నివారణ అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మీరు కచ్చితంగా ఈ దేవాలయానికి వెళ్లి తీరాల్సిందే.

సాధారణంగా నవగ్రహాల దేవాలయంలో శివుడు ప్రధానంగా ఉంటే తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని సూర్యనారాయణ దేవాలయంలో( Suryanarayana Temple ) మాత్రం సూర్యుడే ప్రధానం అని స్థానిక పూజారులు చెబుతున్నారు.ఈ దేవాలయంలోని మూలవిరాట్ అయినా సూర్య భగవానుడు తన ఇద్దరి భార్యలతో భక్తులకీ దర్శనం ఇస్తాడు.

మిగిలిన సూర్యదేవాలయాలలో సూర్యుడు తీవ్రమైన కిరణాలతో ఉంటే ఇక్కడ మాత్రం స్వామి వారు చిరు మందహాసంతో చేతులలో తామర పువ్వులు పట్టుకుని ఆశీర్వదిస్తూ ఉంటారు.

Telugu Bhakti, Devotional, Kumbakonam, Rathasapthami, Shani, Shani Dosham, Shani

ఇంకా చెప్పాలంటే పరమ శివుడి ఎదురుగా నంది ఉన్నట్లు సూర్యుని ఎదురుగా గుర్రం ఉంటుంది.అలాగే ఇక్కడ రథసప్తమిని( Rathasapthami ) అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.క్రీస్తు శకం 11 శతాబ్దంలో సూర్యనారాయణ ఆలయాన్ని మహారాజు నిర్మించినట్లు చరిత్రలో ఉంది.

ఇక్కడ అనారోగ్య సమస్యలు, కుజదోషం, ఎలినాటి శని, జాతక చక్రంలో రాహు, కేతువు దోషాలు వంటివి ఉంటే ఈ దేవాలయాన్ని సందర్శించుకుని పూజిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి.

Telugu Bhakti, Devotional, Kumbakonam, Rathasapthami, Shani, Shani Dosham, Shani

సూర్య భగవానుడితోపాటు గురుడిని 11 ఆదివారలు పూజిస్తే ఏలినాటి శని తో పాటు ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు.ఈ దేవాలయంలో పూజ చాలా నిష్టగా ఉంటుంది.పూజ అనంతరం దేవాలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి.

సూర్య భగవానుడికి నైవేద్యంగా చక్కెర పొంగలి పెట్టాలి.ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు దూరమైపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube