మహా శివరాత్రి రోజు రాత్రి అసలు ఎందుకు జాగరణ చేయాలో తెలుసా..!

మహా శివరాత్రి పండుగ రోజు దాదాపు పరమశివుడి భక్తులందరూ పరమశివుడి కోసం జాగరణలు, ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు.ఎందుకంటే మహా శివరాత్రి ఎంతో పవిత్రమైన పండుగలలోనీ ఒక పెద్ద పండుగ.

 Do You Know Why You Should Keep Awake On The Night Of Maha Shivratri Details, Ma-TeluguStop.com

ఈ రోజు జాగరణలు చేస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు.శివరాత్రి రోజున శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు.

అంతే కాకుండా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు జాగరణ ఉండాలని పండితులు చెబుతూ ఉంటారు.అసలు మహాశివరాత్రి రోజు ఎందుకు జాగరణ ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మహా శివరాత్రి రోజు పరమేశ్వరుడిని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పరమశివుని భక్తులు మహాశివరాత్రి రోజున శివయ్యను ఆరాధించడం వల్ల తము శాంతిని, ప్రశాంతతను పొందుతామని గట్టిగా నమ్ముతారు.

అంతే కాకుండా మహా శివరాత్రి రోజు రాత్రి సమయం లో మనషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.

Telugu Awake, Bakti, Bel Patra, Devotional, Mahashiva, Maha Shivratri, Paramashi

ఇంకా చెప్పాలంటే మహా శివరాత్రి రోజున రాత్రి వెన్నెముక ను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరని చెబుతున్నారు.ఈ లోకంలో అన్ని జాతుల కన్నా మనుషులు వేగంగా విస్తరించారు.అందుకే వీరంతా వెన్న ముక్కలు నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు.అలాగే గరుడ, స్కందా, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహా శివరాత్రి రోజున ఎవరైతే

Telugu Awake, Bakti, Bel Patra, Devotional, Mahashiva, Maha Shivratri, Paramashi

ఉపవాసం ఉంటారో వారంతా పరమ శివుడికి బిల్వపత్రాలతో పూజ చేయడం మంచిది.ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండడం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మహాశివరాత్రి రోజు జాగరణ ఉండడంవల్ల శివుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube