ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.24
సూర్యాస్తమయం: సాయంత్రం 05.36
రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: ఉ.9.30 ల10.30 మ3.40 సా 5.40 వరకు
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని ప్రారంభించిన పనులు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడం మంచిది.దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడతారు.
వృషభం:
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.విద్యార్థులు ఈరోజు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
మిథునం:
ఈరోజు మీరు తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ప్రారంభించిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగే అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
సింహం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగుతారు.కొన్ని దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నాయి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
తులా:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ప్రారంభించిన పనుల్లో మీ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి.
వృశ్చికం:
ఈరోజు వ్యవసాయ దారులు మంచి లాభాలను అందుకుంటారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
ధనస్సు:
ఈరోజు మీరు చేసే పనిలో మార్పుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మకరం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు వాదనలకు దూరంగా ఉండడమే మంచిది.ఇతరుల మాటలు మీ మనసును ఎంతో నొప్పిస్తాయి.పిల్లల పట్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU