సాధారణంగా సెలబ్రిటీలు బయట కనిపించారు అంటే చాలు అక్కడికి అభిమానులు చేరుకొని వారితో ఫోటోలు సెల్ఫీలు దిగడానికి ఎగబడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు తొక్కిసేలాటలు కూడా జరుగుతూ ఉంటాయి.
అటువంటి సమయంలో సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.ఈ క్రమంలోనే ఆ సెలెబ్రేటీల చుట్టూ ఉండే బాడీగార్డ్ లు వారికి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అటువంటి సమయంలో కొందరు అసహనం వ్యక్తం చేస్తూ అలా వచ్చిన అభిమానులపై మండిపడుతూ ఉంటారు.కానీ బాలీవుడ్ కు చెందిన ఒక బిగ్ బాస్ బ్యూటీ మాత్రం అందుకు పూర్తికి వ్యతిరేకంగా చేసింది.
తన పైకి అభిమాని ఫోటోలు దిగడానికి దూసుకురావడంతో అభిమానులను అడ్డుకున్న బాడీగార్డ్ పై మండి పడింది.అసలేం జరిగింది అంటే.
బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్‌కౌర్ గిల్ తన బాడీగార్డు పై సీరియస్ అయింది.ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
అదే సమయంలో పక్కనే ఉన్న ఆమె బాడీగార్డ్ ఫ్యాన్స్ పై దురుసుగా ప్రవర్తించాడు.దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె అతని పై విరుచుకుపడుతూ నీ సమస్య ఏంటని నిలదీసింది.
తాజాగా దుబాయ్‌లో ఒక ఈవెంట్ కు హాజరయ్యేందుకు వెళ్లగా అప్పుడు ఆమెతో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు.
అప్పుడు అక్కడే ఉన్న ఆమె బాడీగార్డ్ అభిమానులను దూరంగా నెట్టివేయడంతో వెంటనే కోపంతో ఊగిపోయిన ఆమె బాడీగార్డ్ పై పెద్దగా అరిచింది.నీ సమస్య ఏంటని బాడీగార్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.అభిమానులు ఫోటోలు దిగడానికి వస్తే అనవసరంగా భయాందోళనకు గురి చేయొద్దని మండిపడింది.
అయితే ఆమె చేసిన పనికి ఆమెపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.