కూరగాయల్లోనే రారాజు అయిన వంకాయ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.వంకాయను ఏ విధంగా వండినా రుచి అద్భుతంగా ఉంటుంది.
కేవలం రుచిలోనే కాదండోయ్.దీనిలో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే వంకాయ ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.జుట్టు సంరక్షణకు కూడా వంకాయ ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా వైట్ హెయిర్, గ్రే హెయిర్ తో బాధ పడేవారు వంకాయతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే జుట్టు నల్లగా నిగనిగలాడటం ఖాయం.మరి ఆలస్యమెందుకు ఆసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా రెండు వంకాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పై తొక్కలను మాత్రం తీసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వంకాయ తొక్కలు, రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.
వాటర్‌ను మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్‌లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ లేమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకుని స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.
రాత్రి నిద్రించడానికి గంట ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న వాటర్‌ను స్ప్రే చేసి.షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

ఉదయాన్నే మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా నాలుగు రోజులకు ఒకసారి గనుక చేస్తే తెల్ల జుట్టు అయినా, బూడిద రంగులో ఉన్న జుట్టు అయినా.నల్లగా మారుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.మరియు జుట్టు షైనీగా కూడా మెరుస్తుంది.