Shani Dosham : శని దోషం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్న వారు శనీ అనుగ్రహం కోసం ఇలా చేస్తే మంచిదా..

చాలామంది ప్రజలు వారి జీవితంలో ఎంత కష్టపడి పని చేసినా వారి జీవితంలో ఇంకా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు.దానికి కారణం కొంతమంది ప్రజలు నా అదృష్టం బాగాలేదు అని బాధపడుతూ ఉంటారు.

 Those Who Are Facing Problems Due To Shani Dosham Should Do This For Shani's Gra-TeluguStop.com

మరి కొంతమంది నాపై శని ఉంది అని అనుకుంటూ ఉంటారు.శని దోషం వల్ల మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ఒక వ్యక్తి చేసిన కర్మలను అనుసరించి శని కొందరికి శుభాలను, మరికొందరికి కష్టాలను ఇస్తాడు.శని దేవుని ఆగ్రహం వల్ల కొంతమంది జీవితాలలో, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సంబందించిన సమస్యలు ఏర్పడతాయి.

ఇలా జరగకూడదంటే శని దేవుని అనుగ్రహం పొందడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని పనులు చేయాలి అని వెల్లడించారు.జీవితంలో శని దోషం తొలగి పోవాలంటే శనివారం రోజు శని దేవునికి ప్రత్యేక పూజలు పరిహారాలు చేయాలి.

ఎలాంటి పూజలు పరిహారాలు చేస్తే శని దేవుని అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం రావి చెట్టులో అన్ని దేవతలు, దేవుళ్ళు నివసిస్తారని చాలామంది భక్తులు నమ్ముతారు.

విష్ణువు తన భార్య లక్ష్మీదేవి నివాసం రావిచెట్టు అని చాలామందికి తెలుసు.అటువంటి పరిస్థితులలో రావి చెట్టును పూజించే వ్యక్తి శనివారం సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు నీరు పోసి నువ్వుల నూనెతో దీపాలను వెలిగించిన వారిపై ఎప్పుడూ శని దేవుడు అనుగ్రహం ఉండే అవకాశం ఉంది.

రావి చెట్టును పూజించడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది .అనుగ్రహం పొందడానికి శని దేవుడికి అంకితం చేసిన మంత్రాలు చాలీసాను తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి.శని దోషం ఉన్నవారికి ఆ దోషం తొలగిపోయి అనుగ్రహం కలగాలంటే శనివారం రోజు నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఆవాల నూనె, మినుములు, చెప్పులు దానం చేయడం కూడా మంచిదే.ఇంకా చెప్పాలంటే అన్నం లేని పేదవాళ్ళకి అన్నదానం చేయడం కూడా మంచిదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube