పశుపతి అనగా ఎవరు, ఆయన ఏం చేస్తూ ఉంటారు?

పాశం అంటే తాడు. ఆ పాశం చేత కట్ట బడేది ఏదుందో దాన్ని పశువు అంటారు.

 Who Is Pashupathi And What He Do Details, Pashupathi, Maha Shiva, Cow, Paasham,-TeluguStop.com

పశువు అనగానే మనకి ఎద్దులూ, దున్న పోతులూ ఇంకా ఇలా నాలుగు కాళ్ల జంతువులే కళ్ళ ముందు మెదులుతాయి.నిజమే! వాటిని పాశం (నారతో పేనినతాడు) తో కట్టేసే మాట నిజమే.

దాన్ని కట్టినపుడు అది మననించి ఎక్కడికో తిండి దొరికే చోటికి వెళ్ళిపోయే మాట నిజమే! అంత మాత్రాన పశువులంటే నాలుగు కాళ్ల జంతువులు మాత్రమే కాదు.

మానవ జాతిలో ఉన్న మనం కూడ పశువులమే.ఎలాగ? ఇది నా ఇల్లు – ఇదొక పాశం.ఇది నా ధనం ఇదొక పాశం, ఈమె నా భార్య.

ఇదొక పాశం, వీడు నా పుత్రుడు.ఇదొక పాశం, ఫలాని వానికి న్యాయం చెయ్యాలి.

ఇదొక పాశం, దీని పేరు రాగం, ఫలాని వారికి ద్రోహాన్ని తల పెట్టాలి.ఇదొక పాశం, దీని పేరు ద్వేషం, ఇలాటి పాశాలన్నిటితోనూ కట్టబడి ఉన్నవాళ్లం మనం.

పైన అనుకున్నట్లు యజమాని పశువుల్ని ఎలా ఒక స్తంభానికి కట్టి వేస్తాడో అలా పశువులమైన మనని ఇందాక అనుకున్న చిత్ర విచిత్ర పాశాలతో కట్టేసే వాడు శంకరుడు.ఎవరు పాశంతో కట్టేస్తే ఆ పశువుకి ఆ కట్టేసినవాడు యజమాని (పతి) అవుతున్నాడో అలా ఈ పాశాలతో మనవి కట్టేసిన శంకరుడు మన పాలిటి పశుపతి.

మనం చేసే ప్రతీ చర్యకు కారణం అయిన ఆ మహా శివుడే పశుపతి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube