ప్రతిరోజు మనం ఎంత కష్టపడి పని చేసినా ఒక పూట అన్నం తినడం కోసమే.అంటే దాదాపు ఎంత కోటీశ్వరుడైన, పేదవాడైనా కష్టపడి పని చేసేది ఒక పూట అన్నం తినడం కోసమే.
ఇలా మనం కష్టపడి పనిచేసి అన్నం తినాలంటే కూడా అన్నపూర్ణ దేవి అనుగ్రహం మన ఇంటిపై ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి.అన్నపూర్ణమ్మ దేవి అనుగ్రహం ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఆకలితో ఉండరు.
అంతేకాకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంటికి సిరీ సంపదలు వస్తాయి.కానీ అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఎంత డబ్బున్న ఆనందంగా రెండు పూటలా తినలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రతిరోజు అన్నపూర్ణ స్తోత్రాన్ని భక్తితో తప్పకుండా పాటిస్తూ ఉంటే తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నకరీ, నిర్ధూతాఖిలాఘోరపావనకరీ ప్రత్యక్షమహేశ్వరీ.
అన్నపూర్ణ దేవి స్తోత్రం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అన్నపూర్ణా దేవి స్తోత్రాన్ని ప్రతి రోజు పాటించడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలకు కొరత ఉండదు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించిన ఇంట్లో ఆహారానికి, ధనానికి ఎప్పుడు తక్కువగా ఉండదని చాలామంది నమ్ముతారు.ఇంటికి వచ్చిన వారంతా సంతృప్తిగా వెళతారు.
అంతే కాకుండా ఆ ఇంట్లో అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

అన్నపూర్ణా దేవి స్తోత్రము పాటించే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.అన్నపూర్ణ స్తోత్రాన్ని పాటించాలంటే ముందుగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండడం ఎంతో ముఖ్యం.ప్రతి రోజు పూజ చేసిన తర్వాత స్తోత్రాన్ని పటిస్తూ ఉండడం మంచిది.
అన్నపూర్ణా దేవి చిత్రపటం లేదా విగ్రహానికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. బియ్యం, గోధుమలు, వరి లతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించడం మంచిది.
ఇంకా చెప్పాలంటే అన్నపూర్ణాదేవి సూత్రాన్ని పఠించడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.