తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ప్రతి మంగళవారం స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్కని పొంగలి, మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.
సోమవారం రోజున స్వామి వారిని దాదాపు 72,000 మంది భక్తులు దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే స్వామివారికి దాదాపు 27 వేల మంది తలనీలాలు సమర్పించారు.
అంతే కాకుండా ఐదున్నర కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలు సమర్పించారు.ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
దీని వల్ల స్వామి వారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది.ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.

శ్రీవారి పంచాంగ శ్రవణం హుండీ జనాకర్షణ విన్నవించి బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామివారి కి నైవేద్యంగా సమర్పిస్తారు.నవనీత హారతి సమర్పించి అనంతరం స్వామివారిని తిరిగి సన్నిధిలో పవళింప చేస్తారు.ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డు, వడలు, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆ తర్వాత దేవాలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి ఉత్సవమూర్తులను దేవాలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలను అర్చకులు నిర్వహిస్తారు.సాయంత్రం పూట సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన తర్వాత నిత్య ఉత్సవం నిర్వహిస్తారు.సర్వదర్శనం నిలుపుదల చేసిన తర్వాత శ్రీవారికి రాత్రి కైంకర్యాలు అర్చకులు ప్రారంభిస్తారు.
ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన రాత్రి ఘంటాబలి నిర్వహిస్తారు.తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించి సర్వదర్శనం పూర్తయిన తర్వాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను అర్చకులు నిర్వహిస్తారు