కోరుకొండ శ్రీ లక్ష్మీనర సింహస్వామి రథోత్సవంలో అపశృతి జరిగింది.ఈ కార్యక్రమంలోని రథం చక్రాల క్రింద ఇరుక్కుని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
అటు భక్తుల కొలహాలు మధ్య రథోత్సవం వైభవంగా జరిగింది.తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీనర సింహస్వామి రథోత్సవంలో అపశృతి జరగడం భక్తులను విస్మయానికి గురి చేసింది.
రథం ముందుకు కదులుతున్న ఆ సమయంలో రథం చక్రాల వెనుక ఇరుక్కుపోయిన ఇద్దరు భక్తుల కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ఒక వ్యక్తికి ఒక పాదం మీద నుంచి రథం వెళ్ళగా స్వల్పంగా గాయా గాయపడ్డాడు.మరో వ్యక్తికి రెండు కాళ్లపై నుంచి రథం వెళ్ళగా తీవ్రంగా గాయపడ్డాడు.అతన్ని రెండు కాళ్లు విరిగిపోయాయి.
ఇద్దరి భక్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం మధ్యాహ్నం 1.56 నిమిషాలకు మొదలైంది.ఈ పుణ్య కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య నరసింహ స్వామి రాజవీధుల్లో విహరించారు.
ధర్మకర్త రంగ రాజ భట్టర్ పర్యవేక్షణలో రథం నాలుగు వీధుల మీదుగా ప్రయాణం చేసి శివాలయం రంగనాథ స్వామి దేవాలయం మీదుగా నరసింహస్వామి దేవస్థానానికి చేరుకుంది.అయితే రథం పైకి భక్తులు అరటి పండ్లను విసిరి భక్తిని చాటుకున్నారు.కోరుకొండ లక్ష్మీనర సింహస్వామిని మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ మాధవి లత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకున్నారు.స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంత్రి తానేటి వనిత కొండ పైకి 600 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
మరోవైపు స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవం మొత్తం ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతున్నాయని దేవాలయాల సిబ్బంది తెలిపారు.