సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారి దేవాలయం ఇదే..!

హసనాంబ అమ్మవారు( Hasanamba ) సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు.అందులోనూ దీపావళి పర్వదినాన మాత్రమే దేవాలయాన్ని తెరుస్తారని స్థానిక భక్తులు చెబుతున్నారు.

ఈ దేవాలయ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ దేవాలయం కర్ణాటక( Karnataka )లోని హసన్ జిల్లాలో ఉంది.జైన మతాన్ని బాగా నమ్మే హోయ్‌సల సామ్రాజ్యంలోని రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు.12వ శతాబ్దంలో ఈ హసనాంబ అమ్మవారి దేవాలయం నిర్మించారు.దీపావళి పండుగ సమయంలో మాత్రమే ఈ దేవాలయాన్ని తెరిచి ఉంచుతారు.

దీని వల్ల భక్తులు అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో తరలివస్తారు.మళ్ళీ దీపావళి వరకు అమ్మవారి దగ్గర అందించిన నంద దీపం వెలుగుతూనే ఉంటుందని పూజారులు చెబుతున్నారు.

<ఇంకా చెప్పాలంటే దీపంతో పాటు అన్న నైవేద్యం, పూలు, నీళ్లు కూడా అమ్మవారి ముందు ఉంచుతారు.నంద దీపంలో నెయ్యి అయిపోకుండా ఏడాది పాటు వెలిగేలా చూసుకుంటారు.

Advertisement

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమ్మవారికి పెట్టే అన్న నైవేద్యం మళ్ళి తర్వాత తలుపులు తెరిచాక కూడా చెడిపోకుండా అలాగే ఉంటుందని భక్తులు చెబుతున్నారు.బ్రహ్మీ, మహేశ్వరి, కౌమారి వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అమ్మవారు ఒకరోజు హాసన్ జిల్లాకు వచ్చినప్పుడు అక్కడి అందాలు చూసి పరవశించిపోయారు.

దాంతో అక్కడే కొలువై ఉండాలని నిర్ణయించుకున్నారని భక్తులు కూడా చెబుతున్నారు.

మహేశ్వరి, కౌమారి, వైష్ణవి అమ్మవారు దేవాలయంలోని మూడు చీమల పుట్టలలో కొలువై ఉండాలని అనుకున్నారు.బ్రహ్మి అమ్మవారు హొసకోటేలోని కెంచమ్మ అమ్మవారిగా కొలువై ఉన్నారు.ఇంద్రాణి, వారాహి, చాముండి అమ్మవారు దేవెగిరి హోండలోని బావుల్లో కొలువు తీరాలని నిర్ణయించుకున్నారు.

హసన్ జిల్లాకు( Hassan District ) హాసనంబా అమ్మవారి పేరు నుంచే పెట్టారు.అక్కడి అమ్మవారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందని ఆ పేరు వచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 2, గురువారం 2024

ఒకసారి హసనాంబ అమ్మవారి నగలను నలుగురు దొంగలు దొంగలించాలని ప్రయత్నించారు.వారిని అమ్మవారు రాళ్లుగా మార్చేశారు.ఆ రాళ్లు ఇప్పటికీ కల్లప్ప దేవాలయంలో దర్శనమిస్తాయి.

Advertisement

మరో ఘటనలో ఒక భక్తురాలని ఆమె అత్తగారు చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆమెను కూడా రాయిలా అమ్మవారు మాట చేశారు.ప్రతి సంవత్సరం ఈ రాయి అంగుళం పాటు పెరుగుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు.

తాజా వార్తలు