తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ జరుపుకునే అతిపెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి.ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.గొబ్బెమ్మలు భోగి మంటలు, గంగిరెద్దులు, పిండివంటలు, హరిదాసు, కీర్తనలు, రథం ముగ్గులు, కోడిపందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరే లెవెల్ గా ఉంటుంది.
ఈ పండుగ తొలి రోజున భోగి అని పిలుస్తారు.రెండో రోజున మకర సంక్రాంతిగా, మూడో రోజున కనుమ, నాలుగో రోజున ముక్క నుమ పిలుస్తూ ఉంటారు.
సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు ప్రారంభిస్తారు.భోగిమంటల్లో పాత వస్తువులన్నీ వేయడం ఎప్పటినుంచోవస్తున్న సంప్రదాయం.భోగి రోజు చేసే బొమ్మలకు ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తూ ఉంటారు.ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగి పండ్లను పోస్తూ ఉంటారు.
భోగి పండ్ల కోసం రేగి పండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు వాడుతూ ఉంటారు.మరి కొంతమంది ప్రజలు శెనగలు కూడా ఉపయోగిస్తారు.
భోగి పండుగన రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి దూరమైపోతుంది.

తల పై భాగంలో భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం కూడా పెరుగుతుందని చెబుతారు.రేగిపళ్ళు బదరీ ఫలం అని కూడా అంటారు.శివున్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావణంలో ఘోర తపస్సు చేశారట.ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని పురాణాలలో ఉంది.

ఆనాటి సంఘటనకు ప్రతికగా పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని చెబుతూ ఉంటారు.భోగి ముగిసిన తర్వాత సూర్యుడు దక్షిణ యానం నుంచి ఉత్తరాయారానికి మారుతాడు.ఆరోజు మకర రాశిలోకి అడుగుపెడతాడు.సంక్రాంతి పండుగ కాబట్టి సూర్యున్ని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కాఫలం అని పేరు వచ్చింది.
DEVOTIONAL







