ఆమ్ ఆద్మి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం నోటీసులు జారీ చేసింది.ప్రభుత్వ ప్రకటన ముసుగులో ఆప్ పార్టీ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలకు గాను రూ.163.62 కోట్ల రికవరీ నోటీసులను అందించిందని సమాచారం.పది రోజుల్లోగా ఈ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.ప్రభుత్వ ప్రకటన ముసుగులో పార్టీ ప్రకటనలు చేశారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ఆప్ మంత్రులను టార్గెట్ గా చేసి బీజేపీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లు నోటీసులు జారీ చేశారని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.







