ఏ ఒత్తులతో దీపారాధన చెయ్యాలో తెలుసా?

హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆనవాయితి.ఇంట్లో పూజ చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి.

 Truth Facts About Deepa Radhana In Telugu  Deeparadana, Facts, Hindu Rituals, Co-TeluguStop.com

అయితే దీపారాధన సమయంలో ఒత్తులు సరైన పద్ధతిలో అమర్చి వెలిగించి పూజ చేయడం ద్వారా శుభం కలుగుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.దీపారాధన చేసినప్పుడు మాత్రం దీపాలు ఎల్లప్పుడు తూర్పు వైపుకు తిప్పి ఉంచాలి.

మరి దీపం చేసేటప్పుడు ఎటువంటి వత్తులను వాడాలి? ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఎలాంటి వత్తులనువాడటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం దీపారాధన చేసేటప్పుడు మన ఇళ్ళల్లో ఎక్కువగా ఉపయోగించేవి దూదితో తయారు చేసిన ఒత్తులు.

దూదితో చేసిన ఒత్తులు వెలిగించడం ఎంతో శుభకరం.మరికొందరు కాటన్ వస్త్రాలకు పసుపు రాసి దీపారాధన చేస్తుంటారు.

అలా దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమి కొడుతుంది.సంతానం కోసం ఎదురుచూసే వారు అరటి కాడలతో చేసిన ఓత్తులతో దీపారాధన చేయడం వల్ల వారికి తొందరగా సంతానప్రాప్తి కలుగుతుంది.

తామరపుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి తామర కాడలతో దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి వారి కి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

దీపారాధన చేసే సమయంలో చాలామంది ఆముదం నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు.

కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మనల్ని వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా సిరిసంపదలు చేకూరుతాయి.శనివారం నువ్వుల నూనెతో పూజించడం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న శని ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది.

అంతేకాకుండా మరణ గండం కూడా తొలగిపోతుంది. నేతితో దీపారాధన చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలను చేకూరుస్తాయి.

దీపం వెలిగించిన తరువాత 12 సార్లు ఆ దీపానికి నమస్కరించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube