తులసి కోటను ఇంటిలో ఎటువైపు పెట్టుకోవాలో తెలుసా?

తులసి మొక్క అనేది ప్రతి ఇంటిలో ఉండవలసిన మొక్క.తులసి మొక్క ఎంత ప్రాధాన్యత చాలా ఉంది.

 Where To Plant Tulsi At Home , Plant Tulsi, Home, Telugu Devotional-TeluguStop.com

తులసి మొక్కను నాటటానికి కొన్ని నియమాలు ఉన్నాయి.తూర్పు- వాయవ్యం లేదా ఉత్తర- వాయువ్యాలలో తులసి కోటను నిర్మించే సమయంలో కోట అడుగు నేల కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి.

తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేయటానికి వీలుగా ఖాళీ స్థలం ఉంచాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు గోడలను(కాంపౌండ్ వాల్ ను) ఆనుకుని తులసి కోటను నిర్మించకూడదు.

దక్షిణం దిక్కులో తులసి కోటను నిర్మించాలని అనుకున్నప్పుడు నేల మట్టానికి సమానంగా ఉండకుండా చూసుకోవాలి.కొంచెం ఎత్తు లేదా మరి కొంచెం పల్లంలోగానీ నిర్మించటం మర్చిపోకూడదు.అలాగే పశ్చిమ దిక్కులో తులసికోటను ఏర్పాటు చేయాలంటే నేల ఎత్తుగా లేక లోతుగా ఉండేలా చూసుకోవాలి.ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశల్లో కుండీలనుగానీ, తులసికోటలను గానీ ఎట్టి పరిస్థితిలోను ఉంచరాదు.

అలా చేస్తే ఈశాన్యం బరువు పెరిగి వినాశనానికి దారి తీస్తుంది.పూల కుండీలలో పెంచుకునే తులసి కోటను నైరుతి, దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయువ్య దిశల్లో మాత్రమే పెట్టాలని వాస్తు శాస్త్రం చెప్పుతుంది.

తులసి కోటను ఇంటిలో నిర్మించేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube