ప్రతి ఏడాది చైత్ర మాసంలో కృష్ణ పక్షంలోని సప్తమి, అష్టమి రోజు శీత్లా దేవి( Shitala devi )ని పూజిస్తారు.ఇంకా చెప్పాలంటే శీత్లా మాతను మశూచి దేవత అని కూడా ప్రజలు పిలుస్తారు.
శీత్లా మాత పండుగను హిందూ సమాజంలో బస్యోడ అని పిలుస్తారు.దేవుని పూజించడం వల్ల మశూచి రాదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
చిన్న పిల్లలను మశూచి నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా ప్రజలు ఈ మాటను పూజిస్తారు.స్కంద పురాణంలో శీత్లా మాతకు సంబంధించిన పౌరాణిక కథ వివరణ ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే శీత్లా మాత శివుని సగం రూపంగా పరిగణిస్తారు.పురాణాల ప్రకారం దేవుని లోకానికి చెందిన శీత్లా దేవత తన చేతిలో పప్పులతో శివుని చెమటతో చేసిన జ్వారాసురుని తో భూమి పై విరాట్ రాజు రాజ్యంలో నివసించడానికి వచ్చింది.అయితే విరాట్ రాజు శీత్లా దేవి రాజ్యంలో ఉండడాన్ని నిషే
ధించాడు.అయితే రాజు ప్రవర్తనతో శీత్లా దేవి కోపం తెచ్చుకుంది.అప్పుడు శీత్లా మాత కోపం వల్ల రాజుతో పాటు అక్కడి పౌరుల చర్మం పై ఎర్రటి మచ్చలు కనిపించాయి.
ముఖ్యంగా చెప్పాలంటే వేడి వల్ల ప్రజల చర్మం మండడం మొదలుపెట్టింది.అప్పుడు విరాట్ రాజు ( Virata )తన తప్పుకు క్షమాపణలు చెప్పాడు.దీని తర్వాత రాజు పచ్చి పాలు, చల్లని లస్సిని శీత్లా దేవికి నైవేద్యంగా సమర్పించాడు.
అప్పుడు శీత్లా దేవి కోపం చల్లారింది.అప్పటి నుంచి అమ్మ వారికి చల్లటి వంటకాలు నైవేద్యంగా పెట్టే సంప్రదాయం వచ్చింది.
ముఖ్యంగా చెప్పాలంటే గురుగ్రామ్( Gurugram )లోని శీత్లా మాత దేవాలయంలో ప్రార్థనలు చేయడానికి భక్తులు హర్యానా నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు.ఈ మాత ఆలయంలో ఎప్పుడు భక్తుల రద్దీ ఉంటుంది.