ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తో ముందుకు వచ్చింది.ఇదివరకే వాట్సాప్ లో ఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్( Delete For EveryOne) అనే ఫీచర్ కి అప్డేట్ అన్నమాట.
వాట్సాప్ చాట్లలో మనం ఫోటో లేదా వీడియోను పోస్ట్ చేస్తే, దాన్ని డిలీట్ చేయాలంటే కేవలం పంపిన వారు చాట్ బాక్స్ లో మాత్రమే డిలీట్ అవుతుంది.దానికి కూడా టైం లిమిట్ ఉండడంతో ఆ మెసేజ్ ని గంటల్లోగా డిలీట్ చేసే అవకాశం ఉంది.
ఒకవేళ ఆ తర్వాత కూడా ఆ మెసేజ్ ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for Everyone) అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయాల్సి ఉంటుంది లేదంటే డిలీట్ ఫర్ మీ ( Delete For Me) అనే ఆప్షన్ కూడా ఇందులో ఉంది.అయితే డిలీట్ ఫర్ మీ ఆప్షన్ ను సెలెక్ట్ చేస్తే కేవలం పంపించిన వ్యక్తి చాట్ బాక్స్ లో మాత్రమే డిలీట్ అవుతుంది.
అదే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete for Everyone)తో ఆ మెసేజ్ పంపించిన వాళ్ళందరి చాట్ బాక్స్ లో కూడా డిలీట్ అవుతుంది.

2017 లో వాట్సాప్ డిలీట్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.మొదట్లో ఈ ఫీచర్ టైం లిమిట్ 7 నిమిషాలు ఉండగా, కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ టైం లిమిట్ గంటకు పొడిగించింది వాట్సాప్.దీంతో ఏదైనా మెసేజ్, వీడియో లేదా ఫైల్ అవతలి వ్యక్తి చాట్ బాక్స్ లోకి పంపిన గంటలోపే డిలీట్ చేసుకోవాలి.
లేకపోతే టైం లిమిట్ దాటిన తర్వాత ఆ మెసేజ్ ను ఇతరుల బాక్స్ లో డిలీట్ చేయడం కుదరదు.కానీ ఇప్పుడు ఆ టైమ్ లిమిట్ ఎత్తివేసేందుకు వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫీచర్ ఐఓఎస్ లో కొత్త వీడియో ఇంటర్ ఫేస్ లో కనిపించింది.ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే అందరికీ టైం తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మెసేజ్లను డిలీట్ చేసుకునే అవకాశం ఉంది.
అయితే ఈ ఫీచర్ ను ముందుగా వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.టెస్టింగ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.