బుల్లితెరపై సూపర్ హిట్ గా నిలిచిన సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్( Brahmamudi serial ) ఒకటి కాగా ఈ సీరియల్ లో కావ్య అనే పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో దీపిక రంగరాజ్ మెప్పించారు.ఎప్పుడూ గలగలా మాట్లాడే దీపిక తన నవ్వడంతో పాటు అందరినీ నవ్విస్తూ ఉంటారు.
పైకి సంతోషంగా కనిపించే దీపిక తన మనస్సులోని బాధను తాజాగా ఒక ఇంటర్వ్వ్యూలో వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దీపిక ఒక ఓటీటీ షోలో( OTT show ) మాట్లాడుతూ మనం ఏ పని చేసినా వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్లు ఉండాలని తెలిపారు.
ప్రధానంగా అమ్మానాన్న మన వెనుక నిలబడాలని ఆమె పేర్కొన్నారు.స్నేహితులు, దగ్గరి వాళ్లు ఇలా ఎవరో ఒకరు మోటివేట్ చేసేలా ఉండాలని దీపిక వెల్లడించారు.కానీ అలా నాకంటూ ఎవరూ లేరని దీపిక పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు నేను యాక్టింగ్ మానేసే ఇంట్లో ఉంటానని చదువుకుంటానని ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని ఐటీ జాబ్( IT Job ) చేస్తానని చెబితే అమ్మవాళ్లు ఎంతో సంతోషిస్తారని ఆమె పేర్కొన్నారు.
ఇంట్లో కూర్చుని బాగా చదువుకో అని స్వాగతం పలుకుతారని ఆమె తెలిపారు.యాక్టింగ్ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ నాకు సపోర్ట్ పలకలేదని దీపిక వెల్లడించారు.

వాళ్లు నన్ను ప్రోత్సహిస్తే నేను ఏదైనా చేయగలనని ఇంకా ఎదుగుతానని ఇప్పుడు నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి కొన్నిసార్లు అది బోర్ కొడుతుందని ఆమె పేర్కొన్నారు.ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే మోటివేషన్ చేసుకుని ముందుకెళ్లాలా అని ఆమె ప్రశ్నించారు.దీపిక రంగరాజు వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.దీపిక రంగరాజు రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.దీపికకు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ పెరుగుతోంది.