ముఖంపై ఎంత‌టి మొండి మ‌చ్చ‌ల‌నైనా పోగొట్టే హోం మేడ్ ఫేస్ క్రీమ్ మీకోసం!

మొటిమలు, వయసు పై పడటం, ఎండల ప్రభావం, పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల ముఖంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.ఈ మ‌చ్చ‌లు ముఖ‌ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

 This Is The Home Made Cream To Get Rid Of Stubborn Spots On Face!, Home Made Cre-TeluguStop.com

పైగా ఈ మ‌చ్చ‌లు వ‌చ్చాయంటే ఓ పట్టానా పోనే పోవు.దీంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.

మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ క్రీం ను కనుక వాడితే చాలా సులభంగా మరియు వేగంగా మొండి మచ్చలను వదిలించుకోవచ్చు.మ‌రి ఇంతకీ ఆ హోమ్ మేడ్ క్రీం ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గ్లాస్ జార్‌ తీసుకుని అందులో రెండు బిర్యానీ ఆకులను తుంచి వేయాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, వ‌న్‌ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము, మూడు నుంచి నాలుగు ఫ్రెష్ ఆరెంజ్ పండు తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ ఎండిన పుదీనా ఆకుల పొడి వేసుకోవాలి.చివరిగా మూడు టేబుల్ స్పూన్ల షియా బటర్‌ వేసి బాగా మిక్స్ చేయాలి.

Telugu Tips, Clear Skin, Cream, Latest, Skin Care, Skin Care Tips, Spots, Stubbo

ఇప్పుడు ఈ గ్లాస్ జార్‌ కు మూత పెట్టి మరుగుతున్న నీటిలో పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉంచాలి.షియా బ‌ట‌ర్ పూర్తిగా మెల్ట్ అయిన‌ అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇలా ఫిల్టర్ చేసుకున్న మిశ్రమంలో నాలుగు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేస్తే క్రీం సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ క్రీమ్ ను ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు సాయంత్రం నిద్రించడానికి గంట ముందు అప్లై చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ క్రీమ్ ను కనుక వాడితే ఎంతటి మొండి మచ్చలైన క్రమంగా దూరం అవుతాయి.

అదే సమయంలో చర్మం కాంతివంతంగా మారుతుంది ఈ క్రీమ్ ను వాడటం వల్ల మొటిమలు సైతం త్వరగా తగ్గుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube