హరిహర వీరమల్లు షూట్‌ పూర్తి అయ్యేది ఎప్పుడో తెలుసా?

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఎట్టకేలకు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అయ్యాయి.ఈ సంవత్సరం ఆరంభం లో సినిమా షూటింగ్ చేస్తున్న సందర్భం గా పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

 Pawan Kalyan Hari Hara Veeramallu Shooting Update Details, Hari Hara Veeramallu,-TeluguStop.com

అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా షూటింగ్ జరగక పోవడంతో అభిమానులు అసలు హరి హర వీరమల్లు సినిమా పూర్తి అవుతుందా లేదా అనే అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది.ఎట్టకేలకు దర్శకుడు క్రిష్ పట్టుదల తో వ్యవహరించి పవన్ కళ్యాణ్ ను రామోజీ ఫిలిం సిటీలో కూర్చో బెట్టాడు.

హరి హర వీరమల్లు సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామోజీ ఫిలిం సిటీ లో నవంబర్ 10 వ తారీకు వరకు జరిగే షెడ్యూల్ తో సినిమా దాదాపుగా పూర్తి అయినట్లే అంటూ తెలుస్తోంది.

మరో మూడు నాలుగు రోజుల బ్యాలెన్స్ వర్క్ ఉంటుందని.అది పవన్ కళ్యాణ్ కి వీలున్న సమయంలో చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో అత్యంత ఖరీదైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.

Telugu Harihara, Nidhi Aggarwal, Krish, Pawan Kalyan, Yesu Ratnam, Ramoji-Movie

ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కి జోడి గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమా లో అత్యంత కీలకమైన సన్నివేశాలకు గ్రాఫిక్స్ ప్రధానంగా ఉండబోతున్నాయట.గ్రాఫిక్స్ కోసం ఏకంగా 30 నుండి 40 కోట్ల రూపాయలను నిర్మాత ఏం రత్నం ఖర్చు చేయబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో ఈ సినిమా విడుదల కాబోతుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube