తలకు షాంపూ తో కలిపి వీటిని కలిపి రుద్దితే.. జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ అందమైన, పొడవైన జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు.అయితే మారిన జీవన శైలి పరిస్థితులలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యను( Hairfall ) ఎదుర్కొంటున్నారు.

 Mix Onion Juice And Aloevera Gel In Your Regular Shampoo To Stop Hairfall Detail-TeluguStop.com

అయితే ఈ సమస్యకు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం దొరుకుతుంది.ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరకాలి అంటే కాస్త ఓపికతో ఇంటి చిట్కాలను( Home Remedies ) అనుసరించాలి.

ఇంటి చిట్కాలు చాల ప్రభావంతం గా పని చేస్తాయి.అసలు జుట్టు రాలడానికి పోషకాహార లోపం వంటివి కూడా కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ చిట్కాలు ఫాలో అవుతూ పోషకాహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ఉంటే త్వరగా మంచి ఫలితాలు వస్తాయి.జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడకుండా ఇంటి చిట్కాలను అనుసరించాలి.అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది.మనం ఈ చిట్కా కోసం కేవలం మూడే మూడు పదార్థాలను ఉపయోగించాలి.మనం క్రమం తప్పకుండా వాడే షాంపుని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఉల్లిపాయ రసం,( Onion Juice ) కలబంద జెల్ ను( Aloevera Gel ) వేసి బాగా కలిపి తలకు రుద్దుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోయి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.ఈ చిట్కాలో ఉపయోగించిన ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు జుట్టు రాలకుండా చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యకు కారణమైన చుండ్రుని కూడా తగ్గిస్తాయి.జుట్టు పెరగడానికి ఎంతగానో సహాయపడడమే కాకుండా జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.

ఇక కలబంద జుట్టు పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube