తెలుగు వారి మహావిష్ణవు.. శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.ప్రసిద్ధి చెందిన 108 పుణ్య క్షేత్రాల్లో ఇది 57వదిగా చెబుతుంటారు.

 Do You Know The Temple Of Srikakuleswara Swami Srikakuleswara Swami, Devotional,-TeluguStop.com

శ్రీకాకుళంలో స్వామి వారు స్వయంభువుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మకం.ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్ష్యాత్తు బ్రహ్మ దేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఒక పురాణ కథనం కూడా ఉంది.

కలియుగంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా భయపడిపోయారట.దీంతో వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహా విష్ణవు కోం తపస్సు చేయడం ప్రారంభించారట.

ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షం అయి… భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని వారు కోరారట.అందు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా శ్రీ మహా విష్ణువును అక్కడ ప్రతిష్టించాడట.

బ్రహ్మకు ఆకులమైనందుకు కాకుళమని పేరు వచ్చిందనీ.శ్రీహరిని ఆ చోటునే ప్రతిష్టించినందుకు కాకుళేశ్వరుడిగా కీర్తి పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఈ శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర మహా విష్ణువు.ఇలా చాలా పేర్లతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

అలాగే న క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలోనే ఇక్కడ స్వామికి ఓ ఆలయం ఉండేదని.ఆపై ఇక్కడి స్వామి అదృశ్యమైపోయాడని చెప్తుంటారు.

దాదాపు వెయ్యేళ్ల పాటు ఎవరికీ కనిపించలేడని… ఆ తర్వాత కొన్నాళ్లకి ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధాన మంత్రి నరసింహ వర్మకు కలలో వచ్చి ఎక్కడున్నాడో చెప్తే.ఆ స్వామి వారిని మళ్లీ ప్రతిష్టించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube