పేరూర్ సరస్వతి దేవాలయం( Saraswati Devi temple ) సమీపంలో గరుడ గంగా మంజీరా పుష్కరాలు( Garuda Ganga Pushkaralu) నాలుగో రోజు వేడుకలు వైభవంగా జరిగాయి.మంగళవారం ఉదయం నుంచి ఇతర రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు గరుడ గంగా పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దీంతో గరుడా గంగా సరస్వతి క్షేత్రం శివనామస్మరణలతో మారు మోగిపోయింది.అమ్మవారికి అభిషేకం, సహస్ర కలశాలతో మంజునాథుడికి మహా జలాభిషేకాలు విశేషాలంకరణ, శివ పంచాక్షరి యజ్ఞం, శివకేశవ రుద్రాభిషేకం నిర్వహించారు.
అయితే సరస్వతి ఆలయవ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో గుణకార శర్మ, మహేష్ శర్మ సరస్వతీమాతను ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పుష్కర దేవతకు ప్రత్యేక పూజలు, మంజీరా మంజునాథ స్వామికి 1008 కలశాలతో అభిషేకం చేశారు.
వేడుకలకు తరలివచ్చిన భక్తులు మహిమాన్విత్వమైన గరుడ గంగా పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసి నాగుల విభూతిని ధరించి సరస్వతీ మాత, నాగదేవతను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు దూరం అయిపోతాయని, పితృదేవతలకు శాంతి చేకూరుతుందని వెల్లడించారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ పుష్కర స్నానం చేసి పునీతులు కావాలని కోరారు.అలాగే పవిత్రపు గంగా స్నానం చేసేటప్పుడు త్రికరణ శుద్ధితో ఉండి ఆచారాలను భక్తితో నిర్వహించాలని, శుభ్రమైన వస్త్రాలను ధరించాలని తెలిపారు.అంతే కాకుండా భక్తులు( Devotees ) స్నానం ఆచరించేటప్పుడు తర్పణలు సాయంత్రం శివలింగానికి పసుపు, కుంకుమ, మహాజాలాభిషేకం నిర్వహించాలని వెల్లడించారు.మంజీరా గరుడ గంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులను రాకుండా అన్ని ఏర్పాట్లను కట్టుదిడ్డంగా ఏర్పాటు చేశారు.
మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను కూడా నియమించారు.గరుడ గంగా పూజల్లో అర్చకులు చిలకలూరి శ్రీనివాస్, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు.స్నానానికి వచ్చే ప్రతి భక్తులకు అన్ని అవసరాలను కల్పిస్తున్నారు.ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, సహస్ర కలశాలతో మంజునాధుడికి అభిషేకం, భజన కార్యక్రమాలు ఉంటాయని నిర్వహించారు.భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.
DEVOTIONAL