పరిషత్ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని, టీడీపీ పరిషత్ ఎన్నికలనీ బహిష్కరించినట్లు తాజాగా చంద్రబాబు స్పష్టం చేశారు.ఇటీవల అస్వస్థతకు గురైన మందకృష్ణ మాదిగ ను ఆయన నివాసంలో చంద్రబాబు పరామర్శించడం జరిగింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా.
.తాను రికార్డు సృష్టించినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని.అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనీ ఎవరూ ఏమీ చేయలేరు అని పేర్కొన్నారు.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తాత్కాలికమేనని.స్పష్టం చేశారు.తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో.
ఇటువంటి నేరాలు ఎప్పుడూ చూడలేదని, నిజంగా తాను అధికారంలో ఉన్న సమయంలో రౌడీయిజం చేస్తే జగన్ బయటకు వచ్చే వాడ అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని… ప్రజాస్వామ్యబద్ధంగా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా తనకి కల్పించానీ .ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తుందని.రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై చంద్రబాబు తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు.