హెయిర్ ఫాల్ ( Hair fall )సమస్యతో బాగా విసుకు చెందుతున్నారా.? ఇంట్లో ఎక్కడ చూసినా ఊడిన మీ జుట్టే కనిపిస్తుందా.? ఎన్ని రకాల షాంపూలు మార్చిన జుట్టు రాలడం ఆగడం లేదా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.నిజానికి సరైన పద్ధతులను పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను వారానికి ఒకసారి వాడితే కనుక జుట్టు రాలడం అన్న మాటే అనరు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా తయారు చేసుకోవాలో చకచకా తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు రెబ్బలు కరివేపాకు( curry leaves ), రెండు రెబ్బలు వేపాకు వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు( Pepper ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసుకోవాలి.చివరిగా ఒక కప్పు కట్ చేసిన ఫ్రెష్ ఉల్లిపాయ ముక్కలు మరియు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ సిద్ధమవుతుంది.ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టానిక్ నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు టానిక్ ను స్ప్రే చేసుకోవాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.