సమ్మర్ లో శరీరంలోని అధిక వేడిని మాయం చేసే మ్యాజికల్ డ్రింక్ మీకోసం!

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఎండలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

 A Magical Drink That Removes Excess Heat From The Body! Magical Drink, Body Heat-TeluguStop.com

భానుడి భగభగలకు ప్రజలు బయట కాలు పెట్టేందుకే భయపడుతున్నారు.వేసవి వేడి కారణంగా బాడీ టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగిపోతుంటుంది.

శరీరంలో వేడి పెరిగే కొద్దీ అనేక సమస్యలు తలెత్తుతుంటాయి.అందుకే శరీరంలో వేడిని తొలగించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్ డ్రింక్‌ అద్భుతంగా సహాయపడుతుంది.శరీరంలోని అధిక వేడిని చాలా వేగంగా మాయం చేసేందుకు ఈ డ్రింక్ మీకు గ్రేట్ గా హెల్ప్ చేసింది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రింక్‌ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక నిమ్మ పండు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Magical-Telugu Health

అలాగే ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు( Sabja seeds ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకుని అందులో కట్‌ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలను వేసుకోవాలి.అలాగే నాలుగు నుంచి ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint leaves ), పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్( Black salt ), చిటికెడు మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు, వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసుకోవాలి.చివరిగా రెండు ఐస్ క్యూబ్స్ మరియు వాటర్ తో గ్లాస్ ను ఫీల్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.

Telugu Tips, Latest, Magical-Telugu Health

ప్రస్తుత వేసవి కాలంలో ఈ మ్యాజికల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.బాడీ కూల్ గా మారుతుంది.అలాగే వేసవి వేడి వల్ల నీరసం అలసట తలనొప్పి వంటివి వేధిస్తుంటాయి.

అయితే పైన చెప్పిన డ్రింక్ ను తీసుకుంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు.ఈ డ్రింక్ మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది.అదే సమయంలో బాడీని రిలాక్స్ చేస్తుంది.ఒత్తిడిని తరిమికొడుతుంది.

పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.బాడీ హైడ్రేటెడ్ గా మారుతుంది.

వడదెబ్బ బారిన పడకుండా సైతం ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube