కాకినాడ జిల్లా సీతానగరంలో ఎంపీపీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ నిర్వాకం బయటపడింది.పాఠశాల నుంచి విద్యార్థులను టీచర్ ఆనంద్ బాబు తన ఇంటికి తీసుకువెళ్లి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
తమ పిల్లలతో ఇంటి పనులు చేయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్కూల్ వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు.
దీంతో టీచర్ ఆనంద్ బాబు క్షమాపణలు కోరుతూ చెప్పుతో కొట్టుకున్న పేరెంట్స్ శాంతించలేదని తెలుస్తోంది.ఆనంద్ బాబుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తల్లిదండ్రులు, గ్రామస్తులు చెబుతున్నారు.







