అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అమ్మాయిలు నెలకు కనీసం ఒకసారైనా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.ఆఫ్ కోర్స్ ఫేషియల్ చేయించుకునే అబ్బాయిలు కూడా ఉన్నారనుకోండి.
ఆ విషయం పక్కన పెడితే.బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేసేందుకు రకరకాల ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటారు.
వాటి వల్ల వచ్చే లాభనష్టాలు గురించి పక్కన పెడితే.ఖర్చు మాత్రం భారీగా అవుతుంది.
అయితే పైసా ఖర్చు లేకుండానే ఇంట్లోనే ఫేషియల్ గ్లో ( Facial Glow )పొందవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే ఫేషియల్ అవసరమే ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ), రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు,( Red lentils ) కొన్ని ఎండిన ఆరెంజ్ తొక్కలు, రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ పొడి,( Beet root powder ) రెండు రెబ్బలు ఎండిన వేపాకు( Neem ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న పౌడర్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ లేదా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే ఆశ్చర్యపోయే బ్యూటీ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
ఈ రెమెడీ చర్మాన్ని డీప్ గా క్లెన్సింగ్ చేస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది.
చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.మొటిమలకు అడ్డుకట్ట వేసి మచ్చలను తగ్గుముఖం పట్టేలా ప్రోత్సహిస్తుంది.
క్లియర్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం కాంతివంతంగా అందంగా మెరిసిపోవడం ఖాయం.