పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాలోని కిస్సిక్ సాంగ్( Kissik Song ) ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సాంగ్ కోసమే థియేటర్ లో సినిమాను చూసిన ప్రేక్షకులు ఉన్నారు.
శ్రీలీల( Sreeleela ) ఈ సాంగ్ డ్యాన్స్ స్టెప్స్ అదరగొట్టింది.గణేష్ ఆచార్య ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
పుష్ప ది రూల్ సక్సెస్ తో శ్రీలీల ఖాతాలో కూడా సక్సెస్ చేరిందనే చెప్పాలి.మరోవైపు శ్రీలీలకు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే.
ఈ స్టార్ హీరోయిన్ కు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ కాగా శ్రీలీల తన తల్లితో( Sreeleela Mother ) ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ఫోటోలకు ఫోజులు ఇవ్వమని పుష్ప ది రూల్ భాషలో కిస్సిక్ అంటూ అడిగారు.అదే సమయంలో కిస్సిక్ స్టెప్స్ వేయాలని ఆమెను కోరారు.
అయితే శ్రీలీల మాత్రం కిస్సిక్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తే అమ్మ దెబ్బలు కొడుతుందని పేర్కొన్నారు.పాత్రకు అనుగుణంగా కనిపించడం శ్రీలీల ప్రత్యేకత అని చెప్పవచ్చు.
గతంతో పోల్చి చూస్తే శ్రీలీలకు ఆఫర్లు తగ్గినా మరీ ఆఫర్లు లేని పరిస్థితి అయితే లేదు.ప్రస్తుతం సితార బ్యానర్ లో క్రేజీ ప్రాజెక్ట్ లతో ఆమె బిజీగా ఉన్నారు.ఈ సినిమాలలో ఒక సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో కాగా మరో సినిమాలో రవితేజ హీరో కావడం గమనార్హం.అఖిల్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో సైతం శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది.
ఈ స్టార్ హీరోయిన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.
స్టార్ హీరోయిన్ శ్రీలీల కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ పరిమితంగా ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.సరైన సినిమాలను ఎంచుకుంటే ఈ బ్యూటీ ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరే అవకాశం అయితే ఉంది.శ్రీలీల కెరీర్ కు సంబంధించి ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
నచ్చిన సినిమాలను ఎంచుకోవడం ద్వారా శ్రీలీల సత్తా చాటుతున్నారు.