మధుమేహం( diabetes ).ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి.
మధుమేహం బారిన ఒక్కసారి పడ్డారంటే జీవితాంతం దానితో సావాసం చేయాల్సిందే.అలాగే మధుమేహం ఉన్నవారు ఆహారాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
డైట్ లో ఏమి చేర్చాలి మరియు ఏది నివారించాలి అనేదాన్ని ఎంచుకోవడం చాలా కీలకం.ఈ నేపథ్యంలోనే మధుమేహం ఉన్నవారు మాంసాహారం తినవచ్చా.
తినకూడదా.అన్న విషయాన్ని తెలుసుకుందాం.
మధుమేహం ఉన్నవారికి లో-గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ( Low-glycemic index foods ) ఎంతో మేలు చేస్తాయి.
అటువంటి ఆహారాలు రక్తంలో గ్లూకోజ్( Glucose ) ను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గా విడుదల అయ్యేలా చేస్తాయి.
చికెన్ మటన్ వంటి మాంసాహారాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి.మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు సున్నాగా ఉంటుంది.అందువల్ల మాంసాహారాన్ని మధుమేహం ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.మాంసాహారం తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు.

కానీ మాంసాహారాన్ని చాలా మితంగా తీసుకోవాలి.ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది. శాకాహారమా.లేక మాంసాహారమా.అంటే దాదాపు అన్ని అధ్యయనాలు శాకాహారమనే తేల్చాయి.మాంసాహారం తినడానికి రుచికరంగా ఉంటుంది.
అందుకే చాలా మంది మాంసాహారం అంటే పడి చచ్చిపోతున్నారు.కొందరికి అసలు ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు.
నిత్యం నాన్ వెజ్ ఉండాల్సిందే.మూడు పూటలా తినేవారు కూడా ఎంతోమంది ఉన్నారు.
మాంసాహారంలో ప్రోటీన్ తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.

అయితే ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ మాంసాహారాన్ని ఎంత పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.క్రమం తప్పకుండా మాంసాహారం తినే వ్యక్తులలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు మరియు అధిక శరీర బరువు తలెత్తుతాయి.ఇవన్నీ మధుమేహం మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
మాంసాహారం వల్ల కిడ్నీల్లో యూరిక్ యాసిడ్ అధికమవుతుంది.శరీరం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిన ఈ వ్యర్థ పదార్థం పేరుకుపోతే గౌట్ వ్యాధి లాంటివి వస్తాయి.
ఇది కేవలం రెడ్ మీట్ కు మాత్రమే కాదు.అన్ని రకాల మాంసాహారాలకు వర్తిస్తుంది.