నడక( walking ) వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయనే విషయం దాదాపు చాలా మందికి తెలుసు.అయితే సరైన పద్ధతిలో నడిస్తేనే ఆ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
లేదంటే శరీరంపై ప్రతిజ్ఞ ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు.వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? సరిగ్గా నడవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాము అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ఆరోగ్యకరమైన జీవన విధానంలో ప్రతి ఒక్కరికి నడక ఎంతో అవసరమని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.
అయితే కొంతమంది వాకింగ్ విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు.ఫలితంగా ప్రతికూల ఆరోగ్య ప్రమాణాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
వాకింగ్లో ఎటువంటి టెక్నిక్స్ పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.వాకింగ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.సరైన పాదరక్షకాలు ( Foot protectors )ఉపయోగపంచకపోవడం వల్ల అసౌకర్యాన్ని, నొప్పిని కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.మీరు వాకింగ్లో ధరించే షూస్ విషయంలో సౌకర్యవంతమైనవి మాత్రమే వాడాలని చెబుతున్నారు.
లేదంటే కాలికి బొబ్బలు, పాదాల నొప్పుల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.అంతే కాకుండా వెన్ను సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.
అలాగే వాకింగ్ చేసేటప్పుడు కొంతమంది స్మార్ట్ ఫోన్( Smart phone ) వైపు చూస్తూ వాకింగ్ చేస్తూ ఉంటారు.దీనివల్ల మీ మెడ పై ఒత్తిడి పెరుగుతుంది.
ఫలితంగా మెడనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది.ఇంకా చెప్పాలంటే కొంతమంది వాకింగ్ చేసేటప్పుడు వేగంగా శరీరంలోని నీరు డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంది.అందువల్ల మీరు తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి.లేకపోతే కండరాలలో అలసట వచ్చి మీరు ఎక్కువ దూరం నడవలేరు.అందువల్ల డిహైడ్రేషన్( Dehydration ) కాకుండా మీరు వాకింగ్ కు వెళ్లేటప్పుడు మీతో పాటు మంచినీళ్లు తీసుకొని వెళ్లడం మంచిదని చెబుతున్నారు.అలాగే సరైన భంగిమలో నడవడం వల్ల మీ వెన్నుముక్క పై ఒత్తిడి తగ్గుతుందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
వెన్ను నొప్పి నుండి మీకు ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.వీటితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.