బియ్యాన్ని ఉడకబెట్టడం ద్వారా వచ్చే తెల్లటి ద్రావణాన్ని గంజి అని అంటారు.ఒకప్పుడు గంజిని తాగేసేవాళ్లు.
గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అలా చేసేవారు.కానీ, ఇప్పుడు ఆ రోజులు పోయాయి.
దాదాపు అందరూ గంజిని బయట పారబోసేస్తున్నారు.కానీ, జుట్టును వేగంగా, ఒత్తుగా పెంచుకోవాలని భావించే వారు.
ఇకపై గంజిని అస్సలు పారబోయకండి.ఎందుకంటే, జుట్టు సంరక్షణకు గంజి అద్భుతంగా సహాయపడుతుంది.
ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం గంజిని జుట్టుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్, అర కప్పు గంజి, వన్ టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి షవర్ క్యాప్‌ను పెట్టుకోవాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ రెమెడీని ప్రయత్నిస్తే. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది.మరియు ఈ రెమెడీ ద్వారా డ్రై హెయిర్ సమస్య నుంచి సైతం విముక్తిని పొందొచ్చు.
అలాగే ఒక బౌల్‌లో అర కప్పు గంజి, అర కప్పు కొబ్బరి పాలు, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత దీనిని జుట్టు మొత్తానికి పట్టించి.గంట పాటు వదిలేయాలి.ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా వారంలో ఒకసారి చేస్తే గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు… జుట్టుకి మంచి పోషణనను అందించి నిగారింపుతో కనిపించేలా చేస్తాయి.మరియు హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, స్ప్లిట్ ఎండ్స్ వంటి సమస్యలనూ నివారిస్తాయి.