కీర దోసకాయ, టమాటా.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఇవి రెండు ముందు వరుసలో ఉంటాయి.
ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా డైట్ ను ఫాలో అవుతుంటారు.డైట్ అంటే మనకు ముందు గుర్తుకు వచ్చేవి సలాడ్స్, స్మూతీలే.
అయితే సలాడ్స్( Cucumber TomatoS alad ) విషయానికి వస్తే కీరా దోసకాయ, టమాటాను ఖచ్చితంగా వాటి తయారీలో వాడుతుంటారు.కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.
ఈ రెండు కూరగాయలను కలిపి తీసుకోకూడదు.అలా తీసుకోవడం యమా డేంజర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కీర దోసకాయ( Cucummber ) లో మినరల్స్, ఫైబర్ రిచ్ గా ఉంటాయి.అలాగే టమాటాలో విటమిన్ సి మెండుగా ఉంటుంది.ఈ రెండు కూరగాయలు విడివిడిగా తీసుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.కానీ కలిపి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలను మన బాడీ అబ్సర్వ్ చేసుకునే ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతాయి.
అలాగే కీరా దోసకాయ టమాటా.రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు( Digestion ) నెమ్మదిస్తుంది.
దాంతో డైజేషన్ కష్టంగా మారుతుంది.ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం( Acidity ) తదితర జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తలెత్తుతాయి.అందుకే కీర దోసకాయ టమాటా లను వీలైనంత వరకు కలిపి తీసుకోకుండా ఉండేందుకే ప్రయత్నించండి.ఈ రెండిటిని విని విడిగా తీసుకుంటేనే మీ శరీరానికి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
టమాటా( Tomato ) వల్ల ఇమ్యూనిటీ సిస్టం ౠస్ట్ అవుతుంది.మెదడు చురుగ్గా పని చేస్తుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.మధుమేహం( Diabetes ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే కీర దోసకాయ వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.క్యాన్సర్( Cancer ) వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ సైతం కంట్రోల్ లో ఉంటాయి.అయితే ఈ ఆరోగ్య లాభాలన్నీ పొందాలంటే టమాటా కీర దోసకాయ రెండిటిని విడివిడిగానే తీసుకోండి.