సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు అది పగలైనా, రాత్రి అయిన కలలు రావడం సర్వసాధారణం.అయితే ఈ విధమైనటువంటి కలలో మనకు ఎన్నో వస్తువులు కనిపిస్తుంటాయి.
కొన్నిసార్లు భయంకరమైన వస్తువులు కలలో కనిపిస్తే మరికొన్నిసార్లు ఎంతో సానుకూలమైనవి కలలో కనిపిస్తుంటాయి.అయితే ఏదైనా చెడు సంఘటనలు జరిగినట్టు కలలో కనిపిస్తే మనం వాటిని గుర్తు చేసుకొని ఏం జరుగుతుందో అన్న గాభరా పడుతూనే ఉంటాము.
మరి కలలోకి ఏ వస్తువులు కనిపిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మన కలలో చాలా అరుదుగా కనిపించే వాటిలో శంఖం ఒకటి.
శంఖం మన కలలో కనిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి, నారాయణుడు కనిపించాడని అర్థం.ఈ విధంగా శంఖం కనిపిస్తే వారి జీవితంలో సుఖ సంతోషాలు ఆనందాలు కలుగుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.
గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కలలో వస్తే ఇది ఒక శుభ పరిణామం.ఈ విధమైనటువంటి కలలు వస్తే మీరు చేస్తున్నటువంటి పనిలో ఎంతో మెరుగైన ఫలితాలను లాభాలను పొందుతారు అని అర్థం.
అదేవిధంగా గుర్రం నుంచి కిందకు పడుతున్నట్లు కలలో వస్తే మీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోబోతున్నారని అర్థం.
మన కలలో ఎవరైనా పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు గాజులు ధరిస్తున్నట్టు మనకు కలవస్తే తొందరలోనే వారికి పెళ్లి జరుగుతుందని అర్థం.అలాగే కలలో పక్షులు కనిపిస్తే మన కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు పక్షి రూపంలో కలలోకి వచ్చారు అని అర్థం.ఈ విధంగా పక్షులు కలలోకి వస్తే మన సంపాదన పెరుగుతుంది.
అదే విధంగా చాలా మందికి కలలో పాములు తరుముతున్నట్టు కనిపిస్తుంది.ఈ విధంగా పాములు తరిమినట్టు కలలో వస్తే మీరు అపాయంలో ఉన్నట్టు.
అదేవిధంగా పాము కరిచినట్టు కలలోకి వస్తే మంచి జరుగుతుంది అని అర్థం.కలలో పండ్ల బుట్టలు కనిపిస్తే మన ఇంటికి అతిథులు రాబోతున్నారు అని అర్థం.
మాంసాన్ని ఉడికిస్తున్నట్లు కలలో కనిపిస్తే మన జీవితంలో విశేష ఫలితాలను పొందుతారు.అదే విధంగా కుళ్ళిన మాంసం కలలో కనిపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పడానికి సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతోంది.