ముఖ్యంగా చెప్పాలంటే హస్తముద్రిక శాస్త్రం ( Palmistry )ప్రకారం చేతిలోని రేకులను బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అందులో కొన్ని నష్టాలను కలిగించేవి ఉంటే మరికొన్ని అదృష్టాన్ని అందించేవి ఉంటాయి.
ఒక్కో రేఖకు ఒక్కో అర్థం ఉంటుంది.కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు, ప్రత్యేక కృతులు కూడా ఉంటాయి.
ఈరోజు అరచేతిలో M గుర్తు ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మీరు 35 సంవత్సరాల తర్వాత కచ్చితంగా అదృష్టాన్ని పొందుతారు.
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.వారి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హస్తముద్రిక శాస్త్రం ప్రకారం M గుర్తు కుడి లేదా ఎడమ చేతిపై ఉంటుంది.ఇది అర చేతిపై మూడు గీతలు కలవడం వల్ల ఏర్పడుతుంది.ఇది ఆంగ్ల అక్షరం M ను కూడి ఉంటుంది.చేతులపై ఈ గుర్తు ఉన్నవారు చాలా అదృష్టవంతులు.ఇలాంటి వారిలో నాయకత్వ లక్షణాలు( Leadership qualities ) ఎక్కువగా ఉంటాయి.ఈ వ్యక్తులు చాలా షార్ప్ గా ఉంటారు.
M గుర్తు ఉన్న వ్యక్తులకు రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది.ఈ రంగంలో విజయం సాధిస్తారు.
ఈ వ్యక్తులు సృజనాత్మకతో నిండి ఉంటారు.అంతే కాకుండా వీరు మంచి కళాకారులు, చిత్రాకారులు, గాయకులు, నటులుగా మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి.

అలాగే ఇలాంటి వ్యక్తులు ప్రేమ విషయాలలో కూడా ఎంతో అదృశ్యవంతులు అని చెప్పవచ్చు.వీరి వైవాహిక జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.అలాగే M గుర్తు ఉన్న వ్యక్తులు జీవిత ప్రారంభంలో కాకుండా 35 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వస్తారు.అదృష్టం కలిసి వస్తుంది.దీని కారణంగా తెలివితేటలు పెరుగుతాయి.35 సంవత్సరాల తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు.అలాగే వీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎదుగుతారు.