ఫిబ్రవరి 5వ తేదీన చేసే నది స్నానానికి విశిష్ట ఫలం..

ప్రతి నెలకు హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక ప్రత్యేక ఉంటుంది.మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి తిధిని మాఘ పూర్ణిమ అని అంటారు.

 Bathing In The River On 5th February Is A Special Fruit. Magha Purnima ,  5th Fe-TeluguStop.com

ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 5వ తేదీన వచ్చింది.అంతేకాకుండా ఫిబ్రవరి 5వ తేదీన రవి పుష్ప యోగం ఏర్పడింది.ఈ యోగం ఉదయం7.07 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.13 నిమిషాల వరకు ఉంటుంది.ఈ యోగం ఆధ్యాత్మిక దృక్కోణంతో కూడా మాఘ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

అంతే కాకుండా ఈ రోజున చేసే స్నానం, దానం పూజాఫలంగా, ఫలవంతంగా పరిగణిస్తారు.ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం పౌర్ణమి తిథి ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 9.29 నిమిషములకు మొదలై ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి 11:58 నిమిషముల వరకు ఉంటుంది.సనాతన ధర్మం ప్రకారం పగలు తిధిని పరిగణలోకి తీసుకొని మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 5 2023న జరుపుకుంటారు.

Telugu February, Devotional, Lakshmi Devi, Maha Vishnu, River-Latest News - Telu

ఈ రోజున స్నానం, ధ్యానం, పూజలు చేయడం వల్ల విష్ణువు ఎంతో సంతోషిస్తాడు.పురాణాల ప్రకారం మహావిష్ణువు మాఘ పూర్ణిమ తిధి రోజున గంగాజలంలో నివసిస్తాడు.దేవ దేవతలందరూ భూమిపైన మానవరూపం దాల్చి స్నానం చేసి పూజలు చేసి ప్రయాగరాజ్ సంగమం వద్ద దానధర్మాలు చేస్తారు.

ఈ కారణంగా మాఘమాసంలో కల్పవచనం చేయడం మాఘ పూర్ణిమనాడు గంగా స్నానం చేయడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.మాఘ పూర్ణిమ రోజున నది స్నానం చేసి దానం చేయడంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని జపిస్తూ ఉండడం మంచిది.

Telugu February, Devotional, Lakshmi Devi, Maha Vishnu, River-Latest News - Telu

మాఘ పూర్ణిమ రోజు మీ పూర్వీకుల కు తర్పణం ఇవ్వడం వారి పేరుతో పేదవారికి దానం చేయడం, నిరుపేదల ఆకలి తీర్చడం అత్యంత పుణ్యప్రదం.ఆ రోజు దానధర్మాలు చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతేకాకుండా ఫిబ్రవరి 5వ తేదీన తప్పనిసరిగా నల్ల నువ్వులను దానం చేయడం ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube